సుప్రీం కోర్టు తీర్పు...

- రాజ్యాంగాన్ని కాపాడాలి
- బేరసారాల్ని నిరోధించాలి
- తక్షణ బలపరీక్ష తప్పనిసరి
- మహారాష్ట్రపై సుప్రీం కొరడా
- జస్టిస్ రమణ బెంచ్ సంచలన తీర్పు
'' ఈ కేసులోని రెండు పక్షాలూ తమకు బలముందంటే తమకే ఉందని విభిన్నమైన వాదనలు వినిపించాయి. ఈ దశలో రాజ్యాంగ నైతికత అనేది ముఖ్యమని, దాని ఔన్నత్యాన్ని కాపాడాలని భావించాం. చట్టసభల వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలా వద్దా అనే వివాదం ఎప్పుడూ ఉంది, ఇప్పుడూ తలెత్తింది. అయితే వ్యవస్థాగతమైన మర్యాద, సౌహార్దం ఉన్నపుడు న్యాయపరమైన జోక్యం ఎప్పుడూ రాదు. ఏ వ్యవస్థ అధికారాలు దానికి ఉన్నాయి. వాటిని పరస్పరం గౌరవించుకోవాల్సిందే. ఓ ఆఖరి ప్రయత్నంగా మాత్రమే న్యాయస్థానాల జోక్యం ఉంటుంది. ఈ కేసులోనూ ఆఖరి ప్రత్యామ్నాయంగా వ్యవహారం మా ముందుకొచ్చింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడి, మంచి పాలన జరగాలన్న ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు కోర్టును తీర్పు చెప్పమన్నారు... అందుకే ఈ ఉత్తర్వులు...''